Site icon NTV Telugu

Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Funky Ott

Funky Ott

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’ . వాలెంటైన్స్ వీక్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. అనుదీప్ మార్క్ హ్యూమర్, విశ్వక్ సేన్ ఎనర్జీ ఇష్టపడే వారికి ఒక మంచి ఆప్షన్‌గా నిలిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా.. నరేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతాన్ని అందించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.

Also Read : Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘ఫంకీ’ చిత్రం మార్చి 13, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి మాత్రమే క్లారిటీ రాగా, ఇతర దక్షిణాది భాషల్లో కూడా అదే రోజున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఇలాంటి క్రేజీ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది కాబట్టి, ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఏ రేంజ్ వ్యూస్ రాబడుతుందో చూడాలి. ఒకవేళ మీరు థియేటర్లలో ఈ ఫన్నీ రైడ్‌ను మిస్ అయి ఉంటే, ఈ వీకెండ్‌లో మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయొచ్చు.

Exit mobile version