Site icon NTV Telugu

Vishwak Sen: ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్‌సేన్

Funky

Funky

Vishwak Sen: కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రగ్‌గా మారిన డైరెక్టర్ కె.వి.అనుదీప్, విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతూ, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ బజ్ నెలకొంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ కయాదు లోహర్‌, డైరెక్టర్ అనుదీప్ కె.వి పాల్గొన్నారు.

READ ALSO: Kethireddy Venkatarami Reddy: కోడిని కోసినా కేసులు పెడుతున్నారు.. కూటమికి వినాశనం తప్పదు..!

ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని అన్నారు. వాటిని చిత్రీకరించే టైంలో హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా డైరెక్టర్ అనుదీప్ ఇబ్బంది పడ్డారని సరదాగా ఆటపట్టించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కె.వి. అనుదీప్ ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రడీ అవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోడానికి సిద్ధం అవుతున్నారు. ‘ఫంకీ’ మూవీలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి రోల్ ప్లే చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

READ ALSO: 2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!

Exit mobile version