Site icon NTV Telugu

Teenage Drama: యువతకు నచ్చేలా ‘వర్జిన్ స్టోరీ’

ప్రముఖ నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్‌ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 18న సినిమా జనం ముందుకొస్తున్న నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ‘యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్ లో రొమాన్స్ ఉండాలి. లేకుంటే చాలా మెమొరీస్ కోల్పోతారు. థర్డ్ వేవ్ తర్వాత మళ్లీ సినిమాలకు మంచి రోజులు వచ్చాయి. తాజాగా విడుదలైన ‘డిజె టిల్లు’ మూవీకి కలెక్షన్స్ బాగున్నాయి. వాలెంటైన్స్ వీక్ లో మా సినిమా రిలీజ్ కాబోతుండటం యాప్ట్ గా భావిస్తున్నాం’ అని అన్నారు.

నేటి యువతరం భావోద్వేగాలకు వర్జిన్ స్టోరీ సినిమా అద్దంపడుతుదని లగడపాటి శిరీష తెలిపారు. దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ.. ‘ఇవాళ్టి యూత్ కు అన్నీ వేగంగా జరగాలి. ఫుడ్ కావాలంటే నిమిషాల్లో తెప్పించుకుంటున్నారు. ఇష్టమైన వ్యక్తులను పొందడంలోనూ అదే వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పొందాలన్నా, కోరుకున్న కెరీర్ ను దక్కించుకోవాలన్న సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేమకు అసలు పరీక్ష ఏమిటనేది ఈ సినిమా చూపించాం’ అని చెప్పారు. తమ ‘వర్జిన్ స్టోరీ’ టీనేజర్లకు బాగా నచ్చుతుందని విక్రమ్ సహిదేవ్ తెలిపాడు.

Exit mobile version