NTV Telugu Site icon

Virat Kohli :’చాలా రోజుల తర్వాత’.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

7

7

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇది కోహ్లీకి ఓనమాలు నేర్పిన మైదానం కావడం విశేషం. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులు ఉందనగా కోహ్లీ ఒక ఎమోషనల్ పోస్టుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియానికి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “చాలా కాలం తరువాత ఢిల్లీ స్టేడియంలోకి లాంగ్ డ్రైవ్.. నోస్టాల్జిక్ ఫీలింగ్..” అని క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ చివరిసారిగా ఆరేళ్ల క్రితం ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. 2017లో అనుష్క శర్మను పెళ్లాడిన తరువాత మకాం ముంబైకి మార్చాడు. ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఏడాది కూడా అదే కావడం యాధృచ్చికం. ఈ స్టేడియంలో కోహ్లీకి అన్ని తీపి గుర్తులే. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లో కోహ్లీ 467 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కోహ్లీ ఇక్కడ తొలి టెస్ట్ ఆడాడు. అప్పుడు కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు.

Also Read: YashaSri: విమెన్స్ ఐపీఎల్‌లో ఆడుతుండటం సంతోషంగా ఉంది: యశ శ్రీ