సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు డ్యాన్స్ లు వేస్తె మరికొందరు మాత్రం వింత ప్రయోగాలు చేస్తారు.. వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వీరికేమైనా మంత్రాలు వచ్చా అనే సందేహం రావడం పక్కా.. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
అద్భుతమైన డ్యాన్స్ ను ప్రయత్నించింది.. ఇంట్లోని ఖాలీ సిలిండర్‌ను నెత్తి మీద పెట్టుకున్న ఓ మహిళ.. అంతటితో ఆగకుండా డాన్స్ కూడా చేసింది. తలపై సిలిండర్‌ను బ్యాలెన్స్ చేయడమే కష్టం అనుకుంటే.. ఈమె మాత్రం సిలిండర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే ఎదురుగా బోర్లించిన గిన్నె పైకి కూడా ఎక్కుతుంది. తర్వాత రౌండ్లు తిరుగుతూ నాట్యం చేస్తుంది.. ఆమె చేసే విన్యాసం జనాలను తెగ నవ్వించేంది.. మరో చిన్న బిందె పై కాలు పెట్టి ఒంటి కాలుపై డ్యాన్స్ చేస్తుంది..
అయిన కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండ చేస్తుంది.. కొంచెం బ్యాలెన్స్ తప్పినా సిలిండర్ మీద పడే ఛాన్స్ ఉంది. కానీ ఆమె ఎంతో చాకచక్యంగా సిలిండర్‌ను తలపై పెట్టుకుని, ఈజీగా డాన్స్ చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఈమె టాలెంట్ ను కొందరు మెచ్చుకుంటే.. మరి కొందరు మాత్రం ఇలాంటి విన్యాసం.. చేయడం చాలా కష్టం. అని మరికొందరు, ఇలాంటివి ఎవరూ అనుకరించవద్దు.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..