NTV Telugu Site icon

Viral Video : ఐఫోన్ ను కొనుగోలు చేసిన బిక్షగాడు.. అసలు ట్విస్టేంటంటే?

I Phone

I Phone

ఐఫోన్.. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ బ్రాండ్.. ఈ ఫోన్ తమ దగ్గర ఉండాలని చాలామంది అనుకుంటారు.. ఈ ఫోన్ గురించి ఈమధ్య వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కొంతమంది ఐఫోన్ కొనుగోలు చేయడానికే పైసాపైసా కూడబెట్టుకుంటూ పొదుపు చేస్తూ ఉంటారు.. కాగా ఓ వ్యక్తి బిచ్చగాడి వేషంలో చిల్లర నాణేలు తీసుకుని ఐ ఫోన్ కొనుగోలు చేయడానికి వెళ్లాడు. వేర్వేరు మొబైల్ షాపులకు ఆ వ్యక్తి వెళ్లగా కొన్ని మొబైల్ షాపులు అతడిని షాపులోకి రావడానికి కూడా అనుమతించకపోవడం గమనార్హం. మరికొన్ని మొబైల్ షాపులు అతనిని అనుమతించినా అతని దగ్గర ఉన్న చిల్లర చూసి నో చెప్పారు. చివరకు ఒక మొబైల్ షాప్ యజమాని మాత్రం అతని దగ్గర ఉన్న చిల్లర తీసుకుని ఐ ఫోన్ ను ఇచ్చారు.

ఇకపోతే ఎక్స్ పెరిమెంట్ కింగ్ అనే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే అతని విషయంలో మొబైల్ షాప్ నిర్వాహకులు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఈ సంఘటన జోద్ పూర్ వెలుగు చూసింది..ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ ను ఆ వ్యక్తి కొనుగోలు చేయడం గమనార్హం. తాను బిచ్చగాడిని కాదని ప్రాంక్ అని చెప్పడంతో మొబైల్ షోరూం నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. బిచ్చగాడి వేషం వేసుకున్న వ్యక్తి ఐ ఫోన్ ను కొనుగోలు చేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఐ ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తికి అంత చిల్లర ఎక్కడినుంచి వచ్చిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

ఈ వీడియోను చూసిన వారంత ఇది పాతది అని, కొత్తగా ఏదైనా చేయాలని సలహా ఇస్తున్నారు.. మరికొంతమంది మాత్రం అతనికి ఈ ఫోన్ అవసరమా అంటూ కామెంట్లతో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.. మీరు కూడా ఒకసారి ఆ వీడియోను చూడండి.. మీకు నచ్చిన కామెంట్స్ చెయ్యండి..