Site icon NTV Telugu

Viral Video: రెస్టారెంట్‌లో అమ్మాయి చేయిని కొరికిన రొయ్య.. ఆతరువాత ఏం జరిగిందంటే?

Live Shrimp China Woman

Live Shrimp China Woman

Live Shrimp Bites Woman Hand in Chinese Restaurant: మనం జనరల్‌గా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారంను వండుకుని తింటాం. కానీ చైనా వాళ్ల ఆహారపు అలవాట్లు చాలా వైరైటీగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రకరకాల ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు కూరగాయలు, పళ్లు తినేందుకు మాత్రమే ఇష్టపడతారు. మరికొందరు ఇతర జంతువుల మాంసాన్ని వండుకుని తింటారు. చైనా వాళ్లు మాత్రం రకరకాల కీటకాలు, పాములు, కప్పలు, ఎలుకలు వంటివి తింటుంటారు. ముఖ్యంగా బతికి ఉంటే జీవులను తినేందుకు చైనా వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాకు చెందిన ఓ మహిళ ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. రెస్టారెంట్ టేబుల్ వద్ద తినడానికి రెడీ అవుతోంది. బతికి ఉన్న ఓ రొయ్యను తీసుకుని తన ప్లేట్‌లో వేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అది అటూ ఇటూ కదిలిపోయింది. దీంతో ఆమె దానిని భయంతో వదిలేసింది. ఆ తరువాత ఆమె చాప్ స్టిక్‌తో రొయ్యను తీసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అది మరలా అటూ ఇటూ కదిలిపోయింది. దీంతో ఆమె రొయ్యను భయంతో వదిలేసింది.

మరోసారి చాప్ స్టిక్‌తో రొయ్యను తీసుకోవడానికి ప్రయత్నించడంతో.. అది ఆమె చెయ్యిని కోరికేసింది. దాంతో ఆమె గట్టిగా అరవసాగింది. కాసేపు నొప్పితో విలవిలలాడిపోయింది. పక్కనే ఉన్న వాళ్లు రొయ్యను చేతి నుంచి తీసేశారు. ఈ ఘటన చూసి రెస్టారెంట్‌లోని మిగతా వారు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘చైనా వాళ్లకు ఇదేం పోయే కాలం’, ‘బతికున్న దాన్ని తినడం ఏంటి’, ‘ఆ అమ్మాయికి బాగా అయింది’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version