Site icon NTV Telugu

Viral Video: మద్యం మత్తులో హల్ చల్.. అలా చేస్తే పోతార్రా సామీ

Viral

Viral

Drunken Men Created nuisance, Viral Video: తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాగే ఇద్దరు మందుబాబులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read: Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు.. కేదారినాథ్ యాత్రలో ఘటన

ఈ వీడియోను జ్యోతి కర్కీ అనే యూజర్ ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సమస్యల నగరం నోయిడా వెస్ట్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ వీడియోలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బిల్డింగ్ ఐదో అంతస్తు పిట్టగోడ పైకి ఎక్కారు. అక్కడి నుంచి దూకేస్తాం, పడిపోతున్నాం అంటూ అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న చుట్టు పక్కల వారు వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే వారిని కూడా ఆ యువకులు తిట్టారు. దీంతో స్థానికులు ఆ యువకులకు నచ్చజెప్పి పైకి తీసుకువచ్చారు.

దీనికి సంబంధించిన వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ యువకులు ఇలా చేయడం మొదటిసారి ఏం కాదని అక్కడ ఉన్న వారు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ నోయిడా అపార్ట్ మెంట్ లోనే కొన్ని రోజుల క్రితం పార్కింగ్ విషయంలో గొడవ జరిగిన వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక ఈ వీడియో చూసిన వారు ఆ తాగుబోతులను ఊరికే వదల కూడదని కోరుతున్నారు. ఇలాగే వదిలేస్తే వారు మరింత దిగజారిపోతారని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version