NTV Telugu Site icon

Viral Video: బీర్ ను ఇలా తాగండి.. ఆరోగ్య సమస్యలనుండి బయటపడండి..

Viral Video

Viral Video

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బీర్ ఒక సాధారణ డ్రింక్ కాదు. కానీ మానసిక స్థితిని ఉపశమనం చేసే డ్రింక్. అయితే, దానిని గాజులోకి పోసే విధానం చాలా తేడాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా రుచి, వాసన, అనుభవంలో తేడాలు వస్తాయి. ఇటీవల, ఓ వ్యక్తి గాజు గ్లాస్లో బీరు పోయడానికి సరైన మార్గాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ను పోస్ట్ చేసాడు. అతను హార్డ్ పౌర్, సాఫ్ట్ పౌర్ మధ్య తేడాను అందులో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 3 మిలియన్లకు పైగా వ్యూస్, 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

RCB Playoffs: కన్నీళ్లు ఆపుకోవటానికి కష్టపడ్డ కోహ్లీ.. ఎమోషనల్ వీడియో..

ఇక ఈ వీడియోకు కాప్షన్ గా.. “ఆపండి! మీరు తప్పు మార్గంలో బీరు పోస్తున్నారు. బీరు పోసే పద్దతిని చూద్దాం. ఎందుకంటే మీరు దానిని ఎలా పోస్తారు అనేది దాని రుచి, వాసనను గణనీయంగా ప్రభావితం చేస్తుంది ” అని రాసి ఉంది.

ఇక ఈ వీడియోలో, సరిగ్గా బీరు ఎలా పోయాలో ఆ వ్యక్తి చూపిస్తాడు. అతను మొదట ఒక బీరు డబ్బాను తీసుకొని, దానిని నెమ్మదిగా గాజు గ్లాస్ లో ఓ పక్కకి నిదానంగా పోస్తాడు. అప్పుడు, అతను మరొక గాజు గ్లాస్ ను తీసుకొని, బీరు డబ్బాను త్వరగా ఖాళీ చేస్తాడు. ఫలితంగా పైన మందపాటి నురుగు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏ శైలి సరైనదో వివరించడానికి, అతను రెండు టిష్యూ పేపర్లను తీసుకొని, రెండింటినీ గ్లాస్ లలో ఉంచి కదిలిస్తాడు. దీని ఫలితంగా నిదానంగా పోసిన గ్లాస్ లో నురుగు ఏర్పడుతుంది. మరొక గ్లాస్ లో ఎలాంటి మార్పు ఉండదు.

అధిక కార్బోనేషన్ కారణంగా బీర్ నిదానంగా పోసిన దానిని తాగడం ద్వారా కడుపు ఉబ్బినట్లు, పూర్తిగా నిండినట్లు అనిపించడానికి ఇదే కారణమని ఆయన వివరించారు. స్పీడ్ గా పోసిన బీర్ వల్ల ఉబ్బరం నివారించడంలో సహాయపడుతుండగా., ఇది రుచి, అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిపాడు. ఇక ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు.