NTV Telugu Site icon

Viral Video : పెళ్లి కూతురు కాళ్లు మొక్కిన పెద్దలు.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Gujarath

Gujarath

ఆడపిల్లలకు వయస్సు వస్తే పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తారు.. ఇరవై ఏళ్లు వచ్చాక తల్లి దండ్రులు అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి పంపిస్తారు.. వరుడికి, అతడి కుటుంబ సభ్యులు, బంధువులకు ఎటువంటి లోటు పాట్లు జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. వెళ్లిన చోట కూతురు సుఖ పడాలన్న ఉద్దేశంతో.. అబ్బాయి అడిగిన కట్నం ఇవ్వడంతో పాటు పెట్టిపోతలకు ఎలాంటి లోటు రానివ్వడు.. అతనికి తలకు మించి మర్యాదలు చేస్తారు..

భారతదేశంలో వివాహ బంధానికి సంబందించి ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి.. అనేక సాంప్రదాయాల ప్రకారం జరుగుతూ ఉంటుంది. సామాజిక వర్గాన్ని బట్టి.. వివాహ తంతు మారుతూ ఉంటుంది. సాధారణంగా ఆడ పిల్లను అత్తారింటికి పంపేటప్పుడు కన్నీరుమున్నీరు అవుతారు తల్లిదండ్రులు.. అంతేకాదు అప్పగింతల సమయంలో ఇక చెప్పనక్కర్లేదు.. ఎప్పుడు లేని విధంగా కన్నీళ్లు కట్టలు తెంచుకొని వచ్చేస్తాయి..

కానీ గుజరాత్ లోని ఓ ప్రాంతంలో విచిత్ర ఆచారం ఉంది.. అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మాయి కాళ్ళను చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు కాళ్లు మొక్కుతారు.. తమ బంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు తమ పెంపకంలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని దానికి అర్థం.. ప్రస్తుతం ఓ పెళ్లి వేడుకకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒక్కసారి ఆ వీడియోను చూసేయ్యండి..