Viral Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వినూత్నత, హాస్యాస్పద ఘటనలు, భావోద్వేగ సందర్భాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనేది ఇరు కుటుంబాలకే కాకూండా, వారి బంధుమిత్రులందరికి ఎంతో ఆనందాన్నిచ్చే ఘట్టం. అయితే కొన్నిసార్లు ఈ వేడుకలు అనూహ్యంగా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా, ఓ పెళ్లి స్టేజ్‌పై జరిగిన ఓ ముద్దుల సన్నివేశం సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను కట్టిపడేస్తోంది.
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..
ఈ వీడియోలో ఓ నవదంపతులు పూల దండలు మార్చుకొని స్టేజ్ మీద నిలుచున్నారు. ముందుగా వరుడు తన కాబోయే భార్యపై నోట్లతో దిష్టి తీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత వధువు కూడా అదే రీతిలో దిష్టి తీయడం చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే, ఆ తర్వాతే అసలు సీన్ మొదలవుతుంది. ఒక్కసారిగా వధువు అందరి ముందు స్టేజ్ మీదే వరుడికి ముద్దుల వర్షం కురిపించింది. ఈ అనూహ్య సంఘటనతో అక్కడ ఉన్న అతిథులు, బంధువులు అంతా ఆశ్చర్యపోతారు. కానీ వెంటనే వారంతా వారిద్దరి ప్రేమను సెలబ్రేట్ చేస్తూ చప్పట్లతో హర్షధ్వానాలు చేస్తారు. దీనితో ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండింగ్ గా మారింది.
Read Also: Ali Khamenei: “భయపడొద్దు..” ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కీలక సందేశం..
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తూ.. వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు. బహుశా వారిది లవ్ మ్యారేజ్ కావచ్చు అని కొందరు కామెంట్ చేయగా.., నువ్వు నిజంగా అదృష్టవంతుడివి బ్రో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. కాస్త ఫన్నీగా ఆమె ప్రేమను కాస్త అతడికి పెళ్లి తర్వాత కూడా అందిస్తే సంతోషమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
