NTV Telugu Site icon

Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే.. ఇప్పుడెలా..

Viral Video

Viral Video

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వైరల్ గా మారిన వీడియోలలో అనేక వీడియోలో ఫన్నీ వీడియోలు ఎక్కువగా ఉండడం గమనిస్తూనే ఉంటాం. మరికొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియో లు కూడా తెగ వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోకు సంబంధించిన వివరాలు చూస్తే..

Also Read: OTT Movies: వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న 22 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే..

చిట్టి చిట్టి అడుగులు వేస్తున్న ఓ చిన్నారి షాపింగ్ మాల్ కి వెళ్ళగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ తనని చెక్ చేస్తాడు. అలా సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసిన సమయంలో ఆ చిన్న పాప డ్రెస్ సైడ్ జోబిలో డైరీ మిల్క్ చాక్లెట్ ఉండడంతో అది కాస్త అతను తీసేసుకుంటాడు. పాప బిల్లు కట్టకుండా చాక్లెట్ తీసుకోవడంతో అలా చేయకూడదు అన్నట్లుగా సెక్యూరిటీ గార్డ్ పాపకి నవ్వుతూ సైగలు చేస్తాడు.

అయితే ఆ సమయంలో పాప ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్. ముఖం మొత్తం చిన్నబోయినట్లుగా వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. అయ్యో పాపం చిట్టి తల్లి చాక్లెట్ లాగేసుకున్నాడుగా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోని ఒకసారి వీక్షించండి.

Show comments