Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..

Indrakiladri

Indrakiladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా-2026 ఉత్సవాల సందర్భంగా హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు ద్వారా నగదు రూపంలో రూ. 11.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల ద్వారా రూ. 10,94,36,304.00, నాణేల ద్వారా రూ. 64,96,000.00 వచ్చాయి.

బంగారానికి సంబంధించి మూడు రోజుల్లో కలిపి మొత్తం 496 గ్రాములు (మొదటి రోజు 140 గ్రా, రెండవ రోజు 241 గ్రా, మూడవ రోజు 115 గ్రా) లభించింది. అలాగే వెండి మొత్తం 13 కిలోల 850 గ్రాములు (మొదటి రోజు 4 కిలోల 360 గ్రా, రెండవ రోజు 5 కిలోల 900 గ్రా, మూడవ రోజు 3 కిలోల 590 గ్రా) హుండీలో సమర్పించారు. చెలామణిలో లేని పాత నోట్లను పరిశీలిస్తే, రూ. 2000 విలువైన నోట్లు మొత్తం 17 లభించగా.. రూ. 1000 , రూ. 500 పాత నోట్లు ఏవీ లభించలేదు.

విదేశీ కరెన్సీ విషయానికి వస్తే.. యు.ఎస్.ఎ డాలర్లు 397, మలేషియన్ రింగిట్ 8, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ 160, ఒమన్ రియాల్స్ 6, యూరప్ యూరోలు 45, ఇంగ్లాండ్ పౌండ్లు 65, సౌదీ రియాల్స్ 37, ఖతార్ రియాల్స్ 7, ఆస్ట్రేలియన్ డాలర్లు 50, సింగపూర్ డాలర్లు 8, న్యూజిలాండ్ డాలర్లు 500, హాంకాంగ్ డాలర్లు 20, కువైట్ దినార్లు 4, బహ్రెయిన్ దినార్లు 1, నైజీరియా నైరా 500, మరియు భూటాన్ కరెన్సీ 1 లభించాయి. ఈ కానుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు.