Vijay : సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించున్న నటుడు దళపతి విజయ్. తమిళనాడులో నంబర్ వన్ స్టార్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన ఉండగానే అతడు సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వస్తున్నాడు. సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించడమే గాక, అతడు రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఆస్తిపాస్తులు, ఇళ్లు, తదితర స్థిరచరాస్తులు, స్టేటస్ గురించిన ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలో అతడు నిర్మించిన భారీ మాన్షన్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ డ్రీమ్ హౌస్ కి విజయ్ `నీలంకరై` అని పెరు పెట్టారు. చెన్నైలో ఎంతో ఆహ్లాదకర ప్రశాంత వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ అతడు నిర్మించుకున్న ఈ ఇల్లు అందరి దృష్టిని ఎంతో ఆకర్షిస్తోంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి స్ఫూర్తి ఎవరు? అంటే.. ప్రముఖ హాలీవుడ్ నటుడి ఇంటిని చూసిన తర్వాత ఆయన మనసు పడి అచ్చం అలాంటిదే నిర్మించుకున్నాడు. ఇంతకీ ఎవరా హాలీవుడ్ స్టార్? అంటే… హాలీవుడ్ ఐకాన్ అయిన టామ్ క్రూజ్.
Read Also:Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..
చెన్నైలోని నీలంకరై ఇంటిని నిర్మించడానికి హాలీవుడ్ ఐకాన్ టామ్ క్రూజ్ వాటర్ ఫ్రంట్ బీచ్ మాన్షన్ స్ఫూర్తిని తీసుకున్నారు. విజయ్ ఇంటి శైలి క్రూజ్ ఫ్లోరిడా ఎస్టేట్ తరహా… అమెరికాలో టామ్ ఇంటిని సందర్శించినప్పుడు అది అతడి దృష్టిని ఆకర్షించింది. టామ్ క్రూజ్ ఇంటిని జాగ్రత్తగా డిజైన్ చేయించుకున్నారు. ప్రశాంతమైన బీచ్ వాతావరణాన్ని చూసి విజయ్ స్ఫూర్తిని పొందారు. అందుకే అచ్చం అలాంటి ఇంటినే తిరిగి తాను కూడా నిర్మించుకోవాలని ప్లాన్ చేశాడు. విజయ్ విలాసవంతమైన ఇల్లు, అద్భుతమైన వ్యూ .. తెలివైన డిజైన్, సంపన్నుల ఆవాసాలతో అద్భుత వాతావరణం అతడి అభిరుచికి నిదర్శనం. దళపతి రేంజును ఎలివేట్ చేసే బ్యూటీఫుల్ హౌస్ ఇది. గృహమే కదా స్వర్గసీమ అంటారు. అది సరిగా ఉంటే ప్రపంచాన్ని కూడా ఏలొచ్చని ప్రూవ్ చేసిన వారు ఉన్నారు.
Read Also:IND vs AUS: పెర్త్ టెస్టుకు అరుదైన ఘనత.. 1947 తర్వాత ఇదే మొదటిసారి!