NTV Telugu Site icon

VIGNAN Schools: రాష్ట్రంలో CBSE పదో తరగతి ఫలితాల్లో విజ్ఞన్‌కే మొదటి ర్యాంకు

Vignan

Vignan

VIGNAN Schools: సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో విజ్ఞాన్.. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించింది. మెరుగైన ఫలితాలు అందిస్తున్న పాఠశాల దేశంలో నాలుగు.. రాష్ట్రంలోనే మొదటి నాలుగు అత్యధిక మార్కులు సాధించిన ఏకైక విద్యాసంస్థగా విజ్ఞాన్ నిలిచింది. మొదటి నాలుగు మొదటి స్తానాల్లో నిలిచిన ఐదుగురిని 496 మార్కులతో వైష్ణవి, సాయితేజ, 493 మార్కులతో ప్రణవ్ మనోరామ్,సోని, 491 మార్కులతో హార్దిక లను ఆమె అభినందించారు.

ఇక, ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాంపేట్ లోని విజ్ఞాన్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకు కోసి సంభరాలు చేసుకున్నారు. విద్యాసంస్థల వైస్ చైర్ పర్సన్ లావు రాణి రుద్రమదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తి, పాఠశాల అందజేసిన క్రమబద్ధమైన బోధన, రివిజన్ క్లాసులతో విద్యార్థులకు నిత్యం ఆత్మ విశ్వాసం పెంపొందించే ఉపాధ్యాయుల వల్ల ఈ విజయం సాధ్యపడిందన్నారు. మొదటి నుంచి విద్యార్థులకు వత్తిడి లేని విద్య, ప్రాక్టికల్ నైపుణ్యం అందించడం పాఠశాల ముఖ్య ఉద్దేశం అన్నారు. మా విద్యార్థులు సమాజంలో విలువలతో కూడిన జ్ఞానాన్ని పొందడంతోపాటు, బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా రాణిస్తున్నారన్నారు. భవిష్యత్తు లో అందరు ఉన్నత స్థాయికి చెరుకోవాలని ఆశించారు విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ లావు రాణి రుద్రమ్మ దేవి..