NTV Telugu Site icon

Peru: హైవేపై షాకింగ్ ఘటన.. తుక్కుతుక్కైన భారీ వెహికల్స్.. ఎలా అంటే!

Peru

Peru

నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఇది కరెక్టే. కానీ కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు ఎదురొస్తుంటాయి. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే.. కచ్చితంగా ఆ మాట అనక తప్పదు. ప్రమాదం ఎప్పుడు? ఎలా? తటస్థిస్తుందో చెప్పలేం అని అనడానికి ఈ సంఘటనే ఊదాహరణ. పెరూలో (Peru) జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పెరువియన్ పర్వత ప్రాంతంలో ఓ హైవేపై భారీ వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇంతలో కొండల్లోంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి భారీ వాహనాలపై పడ్డాయి. దీంతో రెండు పెద్ద వాహనాలు తుక్కుతుక్కుగా నలిగిపోయాయి. కానీ అదృష్టవశాత్తు ఇద్దరు డ్రైవర్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన విజువల్స్.. వెనుక వస్తున్న వాహనాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

గత కొద్దిరోజులుగా పెరూలోని పెరువియన్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే శనివారం రహదారిపై వాహనాలు దూసుకెళ్తుండగా బండరాళ్లు రెండు ట్రక్కులపై పడ్డాయి. అంతే రెండు వాహనాలు కూడా నలిగిపోయాయి. ట్రక్కుల్లో తీసుకెళ్తున్న వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా మొత్తం రహదారి అంతా రాళ్లతో నిండిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటనాస్థలికి చేరుకుని 4 గంటల పాటు శ్రమించి రాళ్లను తొలగించారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కారణంగా కొండప్రాంతాలు అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఫిబ్రవరి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని.. కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 18 మంది వరకు మరణించారని, పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు.