Playing Video Game At Surgery: వీడియో గేమ్ ఆడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న రోగి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికే విచిత్రంగా ఉన్న.. కానీ., ఇది నిజం. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సర్జరీ చేసిన అనస్థీషియా టెక్నాలజిస్ట్ డాక్టర్ సుమిత్ ఘోష్, డయాలసిస్ టెక్నీషియన్ డాక్టర్ పింకీ ముఖర్జీ నెట్టింట షేర్ చేశారు. డాక్టర్. ఘోష్, ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. ‘ఆట కొనసాగుతుంది, ఆపరేషన్ కొనసాగుతుంది. అన్నీ అనస్థీషియా వల్లనే. అనస్థీషియా ఎవరికీ నొప్పిని కలిగించదు.’ అని చెప్పుకొచ్చారు.
Coal Mines: ప్రపంచంలో అతిపెద్ద 5 బొగ్గు గనుల్లో 2 మన దేశంలోనే..ఎక్కడంటే..
ఈ వీడియోలో రోగి ఆపరేషన్ గదిలో మంచం మీద పడుకుని ఉండగా డాక్టర్ శస్త్రచికిత్స చేస్తున్నట్లు కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ యువకుడు మొబైల్ లో వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఓరి దేవుడా.. ఆపరేషన్ చేయించుకోవడం ఇంత తేలికన అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో ఆలా ఎలా చేయగలిగావ్ బాస్ అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో బ్రెయిన్ సర్జరీ సమయంలో ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ కనిపించాడు. సిల్వెస్టర్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ దాని వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది. అతని శస్త్రచికిత్సను డాక్టర్ రికార్డో కొమోటార్ నిర్వహించారు. వీడియోలో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నోలన్ గిటార్ వాయిస్తూ పాడటం చూడవచ్చు. తర్వాత నోలన్ కోలుకోవడం కూడా బాగానే ఉంది.
Supreme court: నీట్‌పై విచారణ.. ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు