ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం సాధించేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారన్నారు మంత్రి విడదల రజినీ. విశాఖలో 16 వ గ్లోబల్ హెల్త్ సమ్మెట్ ను ప్రారంభించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజన్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు గ్లోబల్ హెల్త్ సమ్మిట్ జరగనుంది. అమెరికాలో భారతీయ వైద్యులు విశాఖలో సదస్సు నిర్వహించడం అభినందనీయం. సౌమ్య స్వామినాథన్ తో సహా వైద్యులు వైద్యం పై ఏపీ ప్రభుత్వం చొరవ పై సంతోషం వ్యక్తం చేశారు.
విదేశాల్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ఏపీలో అమలును హర్షించారు. అమెరికాలో భారతీయ వైద్యుల సలహాలతో ఏపీలో మెరుగైన వైద్యం పేదలకు అందించే ప్రయత్నం చేస్తాం. సీఎం జగన్ నేతృత్వం లో రాష్ట్రంలో వైద్య పరంగా ముందంజలో ఉన్నామన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులను పునర్నిర్మాణం చేస్తున్నాం అన్నారు మంత్రి విడదల రజిని. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవారికి కార్పోరేట్ వైద్యం అందిస్తున్నాం.
Read Also: Delhi Mayor election: బీజేపీ వర్సెస్ ఆప్.. మేయర్ ఎన్నికలో గొడవ.. కొట్టుకున్న ఇరుపార్టీల నేతలు
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సీఎం జగన్ లక్ష్యం అన్నారు మంత్రి రజిని. నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 450 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారు. తొలిరోజు సదస్సులో సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రసంగించారు. వైద్య సేవలను మరింత మెరుగు పరచడంతోపాటు వైద్య విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, మాతా శిశు మరణాల నివారణ, పౌష్టికాహారం తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. రెండోరోజైన శనివారంనాడు ఏపీ, తెలంగాణ గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 8న ఆర్.కె.బీచ్‌లో హెల్త్ కేర్ వాక్ నిర్వహిస్తారు.
Read Also: Aerobic dance: ఏరోబిక్ డ్యాన్స్ తో ఉపయోగాలేంటి? అనర్థాలేంటి?
