NTV Telugu Site icon

Venu Yeldandi : కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాను..

Whatsapp Image 2023 07 16 At 11.45.52 Am

Whatsapp Image 2023 07 16 At 11.45.52 Am

వేణు యేల్దండి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వెండితెరపై చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ మంచి కమెడియన్ గా ఎదిగాడు వేణు. ఆ తరువాత జబర్దస్త్ లో వేణు వండర్స్ టీంతో అదిరిపోయే కామెడీని అందించాడు..ఆ తరువాత వేణు జబర్దస్త్ కి దూరమయ్యారు.కొన్నాళ్ళ పాటు జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది షో లో తనదైన కామెడీ పండించారు.ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న వేణు ఇటీవలే బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. ఆయన చేసిన మొదటి సినిమా ‘బలగం’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమా గా తెరకెక్కిన బలగం సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఘన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. బలగం సినిమా కుటుంబ అనుబంధాల విలువ తెలియ జెప్పింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ వేణు తీసిన బలగం పలువురి ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అలాగే అంతర్జాతీయంగా వందకు పైగా అవార్డులు కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ పల్లెల్లో తెరలు ఏర్పాటు చేసుకుని మరీ ఈ సినిమాను వీక్షించారంటే బలగం సినిమా ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు..

ప్రస్తుతం తన రెండో సినిమా కోసం కథను సిద్ధం చేసే పనిలో వున్నాడు దర్శకుడు వేణు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన కెరియర్ ప్రారంభం లో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. నేను 1999లో కేవలం రూ.200 తో హైదరాబాద్‌ కు వచ్చాను. ఆ తరువాత ఎన్నో కష్టాలు పడ్డాను.కానీ ఎప్పుడు కూడా నా లక్ష్యం వదులుకోలేదు.సినిమాలు తీయాలన్నదే నా ఏకైక లక్ష్యం. నేను చూడడానికి బాబు మోహన్‌ లా ఉన్నానని చాలా మంది అనడంతో నేను కమెడియన్ గా రానించాను.ఇక జబర్దస్త్‌ షో కు దూరం అయ్యాక సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు.ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అయితే అప్పుడే సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. బలగం సినిమా అప్పుడు పుట్టింది.2011లో నాన్న చనిపోయినప్పుడు సరైన సమయం లేక అన్ని ఆచారాలను నేను చేయలేకపోయాను. బలగం సినిమా కథ రాస్తున్నప్పుడు ఈ విషయం నాకు బాగా గుర్తొచ్చింది. అలాగే నాకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్‌ తో ఆ ఆచారాల గురించి చర్చించడంతో ఆ అంశం పైనే కథను రాసుకొని నిర్మాత దిల్ రాజు గారి సహకారంతో సినిమాను తెరకెక్కించాను అని ఆయన తెలియజేశారు.