Site icon NTV Telugu

US Offers ₹430 Crores: అమెరికా 26 ఏళ్ల పగ.. అధ్యక్షుడిని పట్టిస్తే రూ.430 కోట్లు గిఫ్ట్..

03

03

US Offers ₹430 Crores: అగ్రరాజ్యం అమెరికా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశాధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరిస్తే అక్షరాల 50 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.430 కోట్లు ఇస్తామని పేర్కొంది. అసలు ఎవరా దేశాధ్యక్షుడు.. అమెరికాకు ఆయనపై పగ ఏంటి.. అసలు ఆయన చేసిన నేరం ఏమిటీ… ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టిస్తే అక్షరాల రూ.430 కోట్లు ఇస్తామని అనడానికి కారణం తెలుసుకుందామా..

READ MORE: Prime Minister Narendra Modi: అమెరికా సుంకాల వేళ.. చైనాకు మోడీ..

26 సంవత్సరాల క్రితం ఏం జరిగింది..
వెనిజులా – అమెరికా మధ్య వివాదం దాదాపు 26 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1999లో హ్యూగో చావెజ్ వెనిజులా పగ్గాలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడైన వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే అమెరికా తిరుగుబాటుకు కూడా ప్రయత్నించింది.. అయితే అది విఫలమైంది. అమెరికాను ఇబ్బంది పెడుతున్న కమ్యూనిస్ట్ భావజాలం విత్తనాలను చావెజ్ నాటాడని చెబుతారు. ఆ తర్వాత చావెజ్ అనేక సందర్భాల్లో అమెరికన్ అధ్యక్షులను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించాడు. వెనిజులా అధ్యక్షుడు మదురో చావెజ్ శిష్యుడని చెబుతారు. ఆయన 1999 నుండి 2013 వరకు ప్రభుత్వంలో ఉన్న చావెజ్‌కు అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు. ఆయన చాలాకాలం పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. తరువాత ఉపాధ్యక్షుడయ్యారు, 2012లో చావెజ్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, తనకు ఏదైనా జరిగితే, తదుపరి అధ్యక్షుడిగా మదురోను ఎన్నుకోవాలని ఆయన స్పష్టంగా చెప్పారు. 2013లో చావెజ్ మరణం తర్వాత, మదురో తాత్కాలిక అధ్యక్షుడయ్యారు, తరువాత ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. నికోలస్ మదురో, ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్‌ను సీజ్ చేసినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్‌బాండీ తెలిపారు. వీటిల్లో ఏడు టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని పేర్కొన్నారు. వెనుజువెలా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని బాండీ వెల్లడించారు. మదురోను మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాకు కింగ్‌పిన్‌గా అభివర్ణించారు. అమెరికాలో మాదకద్రవ్యాల వ్యాపారం మదురో మద్దతుతో నడుస్తోందని పేర్కొన్నారు. దీనితో పాటు ఆయనపై అక్రమ ఇరానియన్ వలసదారులను అమెరికాకు పంపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే మదురోపై 15 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. తర్వాత బైడెన్ సర్కార్ దానిని 25 మిలియన్ డాలర్లకు పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్‌పెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన 700 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిల్లో ప్రైవేట్ జెట్లు, తొమ్మిది వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే 2020 మార్చిలో మదురోపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కేసులు నమోదయ్యాయని, ట్రంప్ నాయకత్వం నుంచి మదరో తప్పించుకోలేరని బాండీ పేర్కొన్నారు.

READ MORE: Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..

Exit mobile version