NTV Telugu Site icon

CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

Cn Revanth Reddy

Cn Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ అర్చక బృందం కలిశారు. అనంతరం సీఎంకు ఆశీర్వచనం అందించి రాజన్న ఆలయ ప్రసాదం అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు ఉన్నారు.

Read also: Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్‌ రావ్‌ ట్వీట్‌ వైరల్‌..

వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు, కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని తెలిపారు. విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Lorry Accident: లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్..

Show comments