Site icon NTV Telugu

Vastu Tips : ఇంట్లో రోజూ కర్పూరం వెలిగించవచ్చా? ఏం జరుగుతుందంటే?

Karpuram

Karpuram

మనం దేశంలో హిందువులు రోజూ పూజ చేస్తారు.. కొందరు ముందు పూజ చెయ్యకుండాఏ పని మొదలు పెట్టరు.. అయితే పూజ చేసినప్పుడు హారతి కూడా ఇస్తుంటారు.. హారతికి కర్పూరాన్ని వాడుతారు. అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజూ ఇట్లో కర్పూరంను వెలిగించడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసుకుందాం..

ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక సమస్యల తో ఇబ్బందులు పడుతూ ఉండాలి. అలాంటి వాస్తు దోషాన్ని పోగొట్టుకోవాలంటే.. ఇంటి మూలల్లో కర్పూరం ఉంచడం వల్ల.. వాస్తు దోషాలు తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది..

కర్పూరం నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే మరీ మంచిది..

ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దీంతో సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి తగ్గుతాయి..

అదే విధంగా.. ఆర్థికంగా వృద్ధి చెందాంలంటే కార్యాలయం లో లేదా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం లో డబ్బుకి, ఆహారానికి లోటు ఉండదు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి..

కర్పూరంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు .. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది..

Exit mobile version