NTV Telugu Site icon

Citadel : సిటాడెల్ వెబ్ సిరీస్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్..

Whatsapp Image 2024 03 18 At 12.28.00 Pm (1)

Whatsapp Image 2024 03 18 At 12.28.00 Pm (1)

గత ఏడాది స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ‘సిటాడెల్’ నుండి క్రేజీ అప్డేట్ రానుందని ఇందులో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ బయటపెట్టారు. ఈ అప్డేట్ గురించి చెప్పడం కోసం వరుణ్.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.‘‘అందరికీ హలో. నేను మీ ప్రైమ్ స్నేహితుడిని. సీక్రెట్ న్యూస్ తీసుకొచ్చేశాను. 2024లోనే అతిపెద్ద అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది’’ అంటూ వరుణ్ ధావన్ ఏదో చెప్పబోతుండగా.. సార్ ఇవన్నీ చెప్పకూడదు అంటూ పక్కన నుండి వాయిస్ వినిపిస్తుంది. ‘‘ఇప్పుడు చెప్పకూడదు కానీ మార్చి 19కి చెప్పొచ్చు కదా. మీరు సిద్ధమేనా..?’’ అంటూ వీడియోను ముగించాడు వరుణ్ ధావన్.

ఈ వీడియోలో ఎక్కడా తను ‘సిటాడెల్’ పేరు ఉపయోగించలేదు. కానీ అమెజాన్ ప్రైమ్ తో కలిసి పోస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇది ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అప్డేట్ గురించే అని అర్థమవుతోంది.మీ ప్రైమ్ స్నేహితుడిని నమ్మండి. ఇదే మీకు సూచన. మార్చి 19 కోసం ఎదురుచూడండి’ అంటూ ఈ వీడియోను అమెజాన్ ప్రైమ్ పేజ్ మరియు వరుణ్ ధావన్ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సిటాడెల్’ అనేది అదే పేరుతో ఉన్న అమెరికన్ వెబ్ సిరీస్ కు ఇండియా వర్షన్ గా తెరకెక్కింది. అమెరికన్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్లో నటించింది. ఈ రీమేక్ లో ప్రియాంక చోప్రా పాత్రను సమంత పోషిస్తోంది. రాజ్, డీకేలు దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. దర్శకులతో కలిసి వరుణ్ ధావన్, సమంత కలిసి టీజర్ కట్ ని చూశారు. టీజర్ చాలా బాగా వచ్చిందని చాలాకాలం క్రితమే సమంత, వరుణ్ కలిసి తమ సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు..