Site icon NTV Telugu

Vande Bharat: వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..

Vande Bharat

Vande Bharat

వందే భారత్ రైలు ప్రవేశపెట్టినప్పట్నుంచి ఆవులు, ఎద్దులను ఢీకొంటున్న సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే సంఘటన రిపీట్ అయింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహబూబబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్ లో 428/11 వద్ద మధ్యాహ్నం ఎద్దును ఢీ కొట్టింది. ఎద్దును ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం ఊడిపడింది. దీంతో ఆ రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎద్దును ట్రాక్‌పై నుంచి తొలగించారు. రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్) విరిగినట్లు గుర్తించారు.

READ MORE: Congress: ఏపీ మంత్రి నారా లోకేష్‌ను రహస్యంగా కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

ఇలా వందే భారత్ రైలు, ఆవును ఢీకొట్టడం అన్నది ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు అడ్డుగా జంతువులు రావడం, వాటిని తప్పించేందుకు అవకాశం లేని పరిస్ధితుల్లో గుద్దేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ఆవుల్ని, గేదెల్ని గుద్దేసి డ్యామేజ్ అవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.

Exit mobile version