NTV Telugu Site icon

Gannavaram High Tension: గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య దాడి..

Gannavaram

Gannavaram

AP Elections 2024: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే క్యాండిడెట్ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్ళు విసురుకున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక, ఇరు వర్గాల కార్యకర్తలకు పోలీసులు సర్ది చెప్పి వెనక్కి పంపించారు.

Read Also: KCR: భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా: కేసీఆర్

అలాగే, అంతకు ముందు గన్నవరంలోని బాపులపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన- వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు చేరుకున్నారు. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోప వాదనలు జరగడంతో పోలీసులు సర్ది చెప్పి.. అక్కడి నుంచి పంపించారు.