NTV Telugu Site icon

Joe Biden: వైట్‌ హౌస్‌లో నిరాడంబరంగా జో బైడెన్‌ మనవరాలి వివాహం

Naomi Biden Wedding

Naomi Biden Wedding

Joe Biden: అమెరికా అధ్యక్షడు జో బైడెన్ మనవరాలు వివాహం వైట్‌హౌస్‌లో శనివారం నిరాడంబరంగా జరిగింది. ఆయన మనవరాలు నవోమీ బైడెన్ పీటర్‌ నీల్‌ను వివాహం చేసుకున్నారు. వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు 18 మంది వివాహాలు జరిగియి. ఎక్కువగా అధ్యక్షుల కుమార్తెల వివాహాలే జరిగాయి. ప్రస్తుతం జరగనున్న నోమి బిడెన్ వివాహం 19వది. తొలిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి వివాహం వైట్‌హౌస్‌లో జరగింది. వైట్‌హౌస్‌లో మొత్తం 18 వివాహాలు జరిగితే ఇందులో తొమ్మిది ప్రెసిడెంట్ కూతుళ్లవే జరిగాయి. చివరిసారిగా 1971లో అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కుమార్తె వివాహం అంతకుముందు 1967లో లిండన్ బి. జాన్సన్ కుమర్తె వివాహాలు జరిగాయి. జో బైడెన్ అంతర్గత కూటమిలో నవోమీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవిధంగా ఆయనను ప్రోత్సహించినవారిలో ఆమె ముఖ్య వ్యక్తి.

28 ఏళ్ల నవోమీ బైడెన్, తన కన్నా చిన్నవాడైన 25 ఏళ్ల పీటల్ నీల్‌తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పీటర్ నీల్ న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందాడు. వీరిద్దరి వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో జరిగింది. ప్రెసిడెంట్ కొడుకు హంటర్ బిడెన్ కుమార్తెనే నవోమీ బైడెన్. నవోమీ కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యూయార్క్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాలుగేళ్ల క్రితం కలుసుకున్న వీరిద్దరు అప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వాషింగ్టన్‌లో కలిసి ఉంటున్నారు.

Isha Ambani: తాతైన ముఖేష్‌ అంబానీ.. కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ.. పేర్లేమిటంటే?

నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో శనివారం జరిగగా.. దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సహా దాదాపు 250 మంది అతిథులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మీడియాను అనుమతించవద్దని వధూవరులు కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరినే జీన్-పియర్రే చెప్పారు. ఇది ప్రైవేటు కుటుంబ కార్యక్రమమని తెలిపారు. ఇదిలావుండగా, రిచర్డ్ నిక్సన్ కుమార్తె ట్రిసియా (1971) వివాహం, బరాక్ ఒబామా అధికారిక ఫొటోగ్రాఫర్ పీట్ సౌజా (2013) వివాహం కూడా ఈ మైదానంలోనే జరగడం గమనార్హం.

 

Show comments