Site icon NTV Telugu

Viral Video: యూఎస్‌లో గంటన్నర వైద్యానికి రూ.1.65 లక్షల బిల్లు.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video

Viral Video

Viral Video: అమెరికా అంటే అందరికీ అవకాశాల గని, విలాసవంతమైన జీవితం గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ అనారోగ్యం పాలైతే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. తాజాగా ఒక భారతీయ అమెరికన్ పంచుకున్న అనుభవం అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతోంది. కేవలం గంటన్నర సేపు ఆస్పత్రిలో గడిపినందుకు ఆయనకు ఏకంగా రూ.1.65 లక్షల బిల్లు వచ్చిందని ఆయన పంచుకున్న ఒక వీడియోలో వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Anil Ravipudi: ఒక్కసారిగా దాడి చేసి వెళ్లిపోతారు.. రాజమౌళిపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు!

అసలేం జరిగిందంటే..
పార్థ్ విజయ్‌వర్గియా అనే ప్రవాస భారతీయుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ షాకింగ్ వివరాలను వెల్లడించారు. క్రిస్మస్ రోజున తన భార్య, కుమార్తెతో కలిసి ఐస్ స్కేటింగ్ చేస్తుండగా పార్థ్ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. మోకాలికి గాయం కావడంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాలో అంబులెన్స్ ఖర్చు విపరీతంగా ఉంటుందని తెలిసి, గాయంతో ఉన్నప్పటికీ ఆయన టాక్సీలోనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ రూమ్ (ER)లో కేవలం గంటన్నర మాత్రమే ఉన్నారు. వైద్యులు ఒక ఎక్స్‌రే తీసి, సాధారణ క్రేప్ బ్యాండేజ్ కట్టారు. అయితే మనోడికి ఆస్పత్రికి వెళ్లి వచ్చిన మూడు వారాల తర్వాత బీమా సంస్థ నుంచి బిల్లు వచ్చింది. ఇన్సూరెన్స్ పోగా, కేవలం తన జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా $1,800 (సుమారు రూ.1.65 లక్షలు). ఆ సమయంలో తనకు అందించిన చికిత్సకు అంత భారీ మొత్తం వసూలు చేయడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు అమెరికా వ్యవస్థపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “ఈ ఖర్చుతో భారతదేశంలో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు” అని ఒకరు కామెంట్ చేశారు. “భారతీయ వైద్యులు ఎంత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు” అని మరొకరు కామెంట్ చేశారు.

READ ALSO: MS Dhoni: ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మైదానంలోకి మాహీ బాయ్!

Exit mobile version