Site icon NTV Telugu

Urfi Javed : తన పై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై తీవ్రంగా మండిపడిన ఉర్ఫీ జావెద్..

Whatsapp Image 2023 07 22 At 11.57.55 Am

Whatsapp Image 2023 07 22 At 11.57.55 Am

ఉర్ఫీ జావేద్ ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన హాట్ డ్రెస్సింగ్ స్టైల్స్ తో సోషల్ మీడియాలో ఎంతగానో పాపులర్ అయింది ఈ భామ.ఆమెకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హాట్ బ్యూటీగా ఎంతో మంది అభిమానులను సంపాదించింది ఉర్పీ.డిఫరెంట్ స్టైల్ లో డ్రస్సులు ధరించి తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.నేటి యువతకు వెరైటీ ఫ్యాషన్స్ ను పరిచయం చేసింది ఈ భామ.జీన్స్ ప్యాంట్ ను టాప్ గా మార్చి వేసుకోవడం లాంటి వెరైటీ పనులు చేస్తూ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలస్తుంది ఈ భామ.తాజాగా ఈ భామకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది.ఆమెతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గురువారం రాత్రి ఆమె విమానంలో ముంబై నుంచి గోవా వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెను వేధించాడు. ఎకానమీ క్లాసులో కూర్చున్న తర్వాత ఆమెను టీజ్ చేయడం వంటి పనులు చేసాడు.ఇందుకు సంబంధించిన క్లిప్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఉర్ఫీ.. తన ఆవేదనను చెప్పుకుంది.తనను కొందరు ఈవ్ టీజింగ్ చేశారని ముంబై నుంచి గోవా వెళ్తుండగా తాను వేధింపులకు గురి అయ్యాను అని చెబుతూ ఎమోషనల్ అయింది..వారు నన్ను ఎంతగానో వేధించారు అయితే నేను వారితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక వారి పక్కన ఉన్నవారిని ఈ విషయంపై అడిగితే వారి స్నేహితుడు కూడా మద్యం తాగి ఉన్నాడని ఆమె తెలిపింది.. తాగి ఉన్నా సరే మహిళలతో ఇలా అసభ్యంగా ప్రవర్తించడాన్ని అస్సలు క్షమించ కూడదని చెప్పుకొచ్చింది.అంతే కాదు ఉర్ఫీ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. తాను పబ్లిక్ ఫిగర్‌నే అయినా పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదని చెప్పుకొచ్చింది.నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది

Exit mobile version