NTV Telugu Site icon

Uorfi Javed : రెజ్లర్ల నిరసనపై స్పందించిన ఉర్పీ జావేద్

Urfi

Urfi

Uorfi Javed : మోడలింగ్, ఫోటో షూట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్నది ఆమె ఫోటో షూట్ కాదు, ఆమె ట్వీట్లు. రెజ్లర్ల ఆందోళనపై ఉర్ఫీ నేరుగా వ్యాఖ్యానించింది. మరోవైపు ఉర్ఫీ ఇలా చేసినందుకు చాలా మంది నెటిజన్లచే ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా మంది దిగ్గజ క్రీడాకారులు ఉర్ఫీలా స్పందించలేదు. వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ నకిలీ ఫోటోలను ప్రచారం చేసిన వారికి సూటిగా ప్రశ్నించింది.

ట్వీట్‌లో ఉర్ఫీ జావేద్ రెండు ఫోటోల కోల్లెజ్‌ను పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో సంగీత, వినేష్ బస్సులో సీరియస్‌గా కూర్చుని ఉన్నారు. రెండవ ఫోటోలో ఈ రెజ్లర్ల ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఫేక్ ఫోటోలు తయారు చేసి వైరల్ చేసే వారిపై ఉర్ఫీ విమర్శలు చేసింది. సంగీత, వినేష్ ఫోటో వైరల్ అయిన తర్వాత చాలా వర్గాల నుండి స్పందనలు రావడం ప్రారంభమైయ్యాయి. చాలా మంది ఈ ఫేక్ ఫోటోను నమ్మి రెజ్లర్ల ఉద్యమాన్ని టార్గెట్ చేశారు. దీంతో కొందరు ఫేక్ ఫోటోలు స్ప్రెడ్ చేసే వారిపై దృష్టి సారించారు. ఫేక్ ఫోటోలు సృష్టించే వారిపై ఉర్ఫీ విమర్శలు గుప్పించింది. అబద్ధాలను నిజం చేసేందుకు ఇలాంటి ఎడిటింగ్‌లు చేసే వారు కూడా ఫేక్ గాళ్లే అని ఆమె అన్నారు. ఒకరిని తప్పుగా నిరూపించడానికి అవాస్తవాలపై ఆధారపడేంత దూరం వెళ్లకూడదని ఉర్ఫీ విమర్శించింది.