Site icon NTV Telugu

Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay

బీజేపీలో చేరి, పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి …కేసీఆర్ కూతురు బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తి.. కేసీఆర్ సూచనల మేరకే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. బీఆర్ఎస్ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదు.. మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే పోటీ చేసే వాళ్లం. కాంగ్రెస్ అభ్యర్థి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి. కాంగ్రెస్ లో కేసీఆర్ ఆడిందే అట పాడిందే పాట. అతి త్వరలోనే కాంగ్రెస్ లో brs విలీనం ఖాయం… డిల్లీలో ఒప్పందం జరిగింది. ప్లాన్ ప్రకారం బీజేపీ ని బ్లేమ్ చేస్తున్నారు. ” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Bhagyashri Borse: ప్చ్.. పాపం… ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ!

విగ్రహాల దందా బంద్ చేయాలన్నారు. సమస్యలను డైవర్ట్ చేయడానికి.. విగ్రహాల రాజకీయాల చర్చ చేస్తున్నారన్నారు. ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ తో విజువల్ తీశారని కేటీఆర్ కేసు రేవంత్ రెడ్డి మీద ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆయన ఫార్మ్ హౌస్ కాకుంటే కేసు ఎందుకు పెట్టినట్టు అన్నారు. మహారాష్ర్ట , హర్యానా ఎన్నికలకి డబ్బులు పంపించాలి.. కాబట్టే హైడ్రా పేరు మీద డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

READ MORE: Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!

కాగా..తాజాగా జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

Exit mobile version