NTV Telugu Site icon

Kishan Reddy: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం కాకుండా చూడాలి

Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని CSIR – IICT లో సైన్స్ సిటీ సెంటర్ కు సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్ తో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం అంతా ఎలక్షన్ మోడ్ లో ఉంటే.. ప్రధాని మోడీ మాత్రం కేంద్ర మంత్రులతో 8 గంటల పాటు భేటీ అయ్యారు అని పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో వికసిత భారత్ గురించి చర్చ పెట్టారు అని పేర్కొన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటు ఆలస్యం అయింది.. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ను సైన్స్ సిటీ గా డెవలప్ చేయాలనేది మా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. గత ముఖ్యమంత్రికి ల్యాండ్ కావాలని చాలా సార్లు లేఖ రాశాను.. కానీ, ఇవ్వలేదు అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Jayaprada: కోర్టులో లొంగిపోయిన జయప్రద

దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ IICTలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని అడుగుతాం.. ఇస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సైన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాం.. సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఉంది.. స్కూల్స్ లో విద్యార్థులను సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం కాకుండా చూడాలి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.