NTV Telugu Site icon

Road Accident : తమిళనాడులో చెట్టును ఢీకొన్న టూరిస్ట్ వాహనం.. ఆరుగురు మృతి

New Project 2024 09 25t065644.264

New Project 2024 09 25t065644.264

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉలుందూరుపేట సమీపంలో టూరిస్ట్ వాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 14 మందిని విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో సామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సమాచారం.

Read Also:Pawan kalyan: పంచాయతీరాజ్ సంస్థల్లో కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

ఉలుందూరుపేట సమీపంలోని మెట్టటూరు గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు అక్కడికక్కడే నుజ్జునుజ్జయ్యారు. అరణి సమీపంలోని మంబాక్కం నుంచి తిరుచెందూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కళ్లకురిచ్చి జిల్లా సూపరింటెండెంట్ రజత్ చతుర్వేది ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వీరంతా ఆలయంలో స్వామిని దర్శించుకుని టూరిస్టు వ్యాన్‌లో తిరిగి పట్టణానికి చేరుకున్నారు. అనంతరం ఉలుందూరుపేట సమీపంలోని మెట్టటూరు వద్ద టూరిస్ట్ వ్యాన్ చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also:CM Relief Fund: ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ప‌లువురి విరాళం