NTV Telugu Site icon

Ukraine: రష్యా యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్

Ide

Ide

గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ తన ప్రతాపం చూపించింది. రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్‌ విరుచుకుపడింది. ఓ వైమానిక స్థావరంపై చేసిన దాడిలో ఆరు యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు సిబ్బంది కూడా మరణించినట్లు సమాచారం.

ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవ్స్క్‌ వైమానిక స్థావరంపై గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎయిర్‌బేస్‌ దగ్గర భారీగా పేలుళ్లు జరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు బెల్గరోడ్‌, కరుస్క్‌ వద్ద కూడా ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడులకు యత్నించాయి.