Site icon NTV Telugu

Anti Immigration: లండన్ లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ… భారీగా రోడ్లపైకి వచ్చిన జనం..

Sam (24)

Sam (24)

బ్రిటన్‌లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ జరిగింది. లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.. ఇది లా ఉండగా.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… సెంట్రల్‌ లండన్‌లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ చేపట్టారు. లక్షమందికి జనం రోడ్లపైకి వచ్చారు. జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్‌ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. లక్షా 10 వేల మందికి పైగా ర్యాలీ చేయడంతో రోడ్లపై జనసంద్రం కనిపించింది. ఇదే సమయంలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ కూడా జరిగింది. ఈ ర్యాలీలో కూడా సుమారు 5 వేల మందికి పైగా కనిపించారు. ‘స్టాండ్‌ అప్‌ టు రేసిజమ్‌’ అనే పేరుతో ఈ ర్యాలీ జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు.

నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్‌ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version