Site icon NTV Telugu

Udayanidhi Stalin : హీరో కార్తీకి రూ. కోటి చెక్‌ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్‌.. మ్యాటరేంటంటే?

Stalin

Stalin

సౌత్ సినీ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కొలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019 లో నడిగర్​ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్​, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్​, జనరల్​ సెక్రటరీగా విశాల్​, ట్రెజరర్‌గా హీరో కార్తీని ఎంపిక చేశారు.. అయితే ఈ సంఘం భవన నిర్మాణం కోసం గతంలో డబ్బులు కొరతగా ఉన్నట్లు హీరో విశాల్ తెలిపాడు..

ఈ నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్‌ పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్‌ కోరాడు.. అంతేకాదు కొత్త భవన నిర్మాణం కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఓ సందర్బంలో చెప్పారుకూడా..

ఇదిలా ఉండగా.. తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. ఉదయానిది స్టాలిన్ వారికి భవన నిర్మాణం కోసం రూ. కోటి రూపాయల చెక్ ను అందించారు.. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశాల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు..

Exit mobile version