Site icon NTV Telugu

UCIL Recruitment: బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..

Ucil Recruitment

Ucil Recruitment

మీరు బీటెక్ చదివారా? ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. UCIL లో ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు… ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు..

ఈ పోస్టులకు సంబందించి దరఖాస్తులను ఎప్పటి నుంచో స్వీకరిస్తున్నారు.. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కూడా రాబోతోంది. అందువల్ల.. ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే ఇప్పుడే చేయండి. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18 ఆగస్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 122 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ucil.gov.in సందర్శించాలి. మీ దరఖాస్తు చివరి తేదీ కంటే ముందే దిగువన ఇవ్వబడిన చిరునామాకు చేరుకోవాలని కూడా తెలియజేశారు.

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అనేక దశల పరీక్షల తర్వాత జరుగుతుంది. ముందుగా రాత పరీక్ష, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.. అన్నిటిని క్లియర్ చేసిన వారిని ఎంపిక చేస్తారు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే జనరల్, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. అదే సమయంలో SC, ST, PWDB మరియు మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఇదిలా ఉండగా..దరఖాస్తులు ఆగస్టు 18లోపు చేరుకోవాలని గుర్తుంచుకోండి. అలా చేయడానికి చిరునామా .. జనరల్ మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్/పర్సనల్ & IR/కార్పొరేట్ ప్లానింగ్) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, P.O. జాదుగూడ మైన్స్, జిల్లా- సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832 102 కు పంపించాలి.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version