Site icon NTV Telugu

UBER Viral: ఏంటి భయ్యా.. ఉబెర్ ఆటో చార్జెస్ ఇంత కాస్ట్లీనా.. ఏకంగా కోట్లలో బిల్..!

4

4

నగరాలలో ఒక చోట నుంచి ఒక చోటికి రవాణా చేసే సమయంలో చాలామంది క్యాబ్ సర్వీస్ లను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వీటి ధరలు చాలా ఎక్కువ అయ్యాయి. కస్టమర్స్ ఎక్కువగా కావడంతో.. ఉబర్, ఓలా, రాపిడో ఇలా అనేక రకాల సర్వీస్ లు అందుబాటులోకి వచ్చి అమాంతం చార్జెస్ లను పెంచేస్తున్నాయి. నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరు ఫోన్లో ఈ యాప్ లు దర్శనమియడం కామన్. సమయం తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోకుండా వీటిని ఉపయోగించి వారి గమ్య స్థానాలకు త్వరగా చేరాలని ప్రజలు భావిస్తున్నారు. అయితే వీటివల్ల కొన్నిసార్లు ప్రజలు ఇబ్బంది పడాల్సి కూడా వస్తుంది. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్లాలన్న సమయంలో సర్వీస్ బుక్ చేసుకుందామంటే ఒక్కరు కూడా అందుబాటులోకి రారు. ఇలాంటి తలనొప్పులు కచ్చితంగా నగరాల్లో ఉన్నవారికి జరిగే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ నగరం వద్ద ఉన్న నోయిడా నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

నోయిడాలో నివాసముంటున్న దీపక్ అనే వ్యక్తికి ప్రతిరోజు వెళ్లే రూట్ లోనే ఉబర్ సంబంధించిన ఆటోను బుక్ చేసుకున్నాడు. అయితే ఆటో బుక్ చేసుకో సమయంలో బిల్లు రూ. 62 లు చూపించింది. దాంతో తక్కువే కదా అని రైడ్ బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళాడు. అలా రైడ్ పూర్తి చేసుకున్న తర్వాత.. ఆటో డ్రైవర్ అక్కడ చూపించిన బిల్ ను దీపక్ కు చూపించాడు. దాంతో అతడు ఒక్కసారిగా షాక్ గురైయ్యాడు. దీనికి కారణం అక్కడ అక్షరాల 7.66 కోట్ల రూపాయలు బిల్ అయినట్లు కనపడుతుంది. దీంతో కొద్దిసేపు దీపక్ ఆ షాక్ లోంచి బయటికి రాలేకపోయాడు.

అయితే ఈ విషయం సంబంధించి అతడు తేరుకున్న తర్వాత తన స్నేహితుడితో కలిసి అక్కడి పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోలో తన ఫ్రెండ్ తో కలిసి ఉబర్ సంస్థ పై జోక్స్ కూడా వేశాడు. చంద్రయాన్ కు వెళ్ళినా కూడా ఇంత బిల్ రాదంటూ ఇద్దరు స్నేహితులు అనుకుంటూ నవ్వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన ఉబర్ యాజమాన్యం.. సదరు కస్టమర్ కి క్షమాపణలను తెలియజేసింది. దీన్ని వీలైనంతవరకు అది తక్కువ సమయంలో అప్డేట్ చేస్తామంటూ రిప్లై ఇచ్చింది.

Exit mobile version