NTV Telugu Site icon

George Foreman: ప్రముఖ బాక్సర్ కన్నుమూత..

George Foreman

George Foreman

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) మృతి చెందారు. శుక్రవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “మా హృదయాలు బద్దలయ్యాయి. తీవ్ర దుఃఖంతో 2025 మార్చి 21న ప్రియమైన వారి మధ్య శాంతియుతంగా బయలుదేరిన మా ప్రియమైన జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్‌మాన్ సీనియర్ మరణాన్ని ప్రకటిస్తున్నాము” అని కుటుంబ సభ్యులు ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Minister Narayana: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి..

1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండుసార్లు హెవీ వెయిల్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్‌లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1977లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.

Read Also: Hyderbad: అల్వాల్ లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్… ఓయో రూంకి తీసుకెళ్ళి..