NTV Telugu Site icon

Malaysia: మలేషియాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి

Helicopter Crash

Helicopter Crash

Two helicopters crash: మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ ఈవెంట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు నేవీ హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 10 మంది సిబ్బంది ఉన్నారని స్థానిక మీడియా చెప్పుకొచ్చింది. దాదాపు 10 మంది చనిపోయినట్లు తెలిపింది. దీనిపై ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. స్థానిక మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఛాపర్‌లలో ఒకటి మరొకటి రోటర్‌ను క్లిప్ చేసింది.. దీనిపై మలేషియా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

Read Also: Gita Sabharwal: ఇండోనేషియాలో యూఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా గీతా సబర్వాల్ నియామకం

కాగా, ఈ ఘటన రోజు ఉదయం లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ (RMN) బేస్ దగ్గర జరిగిందని అధికారులు తెలిపారు. ఇక, స్థానిక నివేదికల ప్రకారం.. M503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్ (HOM)లో ఏడుగురు సిబ్బంది ఉండగా, మరొక M502-6, బోర్డులో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు హెలికాప్టర్లు మే నెల 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ డేతో కలిసి నిర్మాణ శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.