Site icon NTV Telugu

Thummala Nageswara Rao: నా కోరిక అదే.. సీతారామ ప్రాజెక్ట్ పై తుమ్మల కామెంట్‌

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Thummala Nageswara Rao: తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం లో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు తలపెట్టినది సీతారామ ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పటికే 7 వేలకోట్ల కు పైగా ఖర్చు జరిగిందన్నారు. టన్నెల్ రెండు వైపుల నుండి పనులు చేసి పూర్తి చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి, లంకా సాగర్ కు నీళ్లు అందుతాయన్నారు. గండుగలు పల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Read also: Punjab : ఆ గ్రామానికి శనిలా పట్టుకున్న బట్టల అద్దకం ఫ్యాక్టరీ.. మూడు నెలల్లో 35మంది మృతి

యాతాల కుంట టన్నెల్ ప్రధానమైందని అన్నారు. నిత్య పర్యవేక్షణతో అధికారులు పనులు పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి నియోజక వర్గానికి సీతారామ ప్రాజెక్ట్ లో ప్రధానమైంది యతాల కుంట టన్నెల్ అని తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు కోరారు. తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమే అని అన్నారు. ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని కోరారు. పనులకు ఆటంకం కలగకుండా చూస్తానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల ఆశా..ఆకాంక్ష అన్నారు.
BJP MLA: టికెట్‌ కొనకపోతే బిచ్చమెత్తుకున్నట్లే.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..!

Exit mobile version