Site icon NTV Telugu

TTD For Ayodhya: ఇవాళ అయోధ్యకు టీటీడీ కమిటీ..

Ram

Ram

TTD For Ayodhya: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శానికి ప్రతీ రోజూ వేలాది మంది తరలివస్తుంటారు.. ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే ఇక చెప్పకరలేదు.. అయితే, ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యలు, దర్శనభాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీసుకునే చర్యలు ప్రశంసనీయం.. ఇప్పుడు అయోధ్యలో సైతం మన తిరుమలలో నిర్వహణ ఎలా ఉందే.. అలాగే నిర్వహించే కసరత్తు సాగుతోంది.. ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ సభ్యులు.. అయోధ్య ఆలయ నిర్వహణపై ఆలయ ట్రస్ట్ కి నివేదిక సమర్పించనున్నారు ఈవో ధర్మారెడ్డి.. గత ఫిబ్రవరి 18వ తేదీన అయోధ్య ఆలయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ.. అయోధ్యలో భక్తుల సౌకర్యాలకు చేపట్టాల్సిన అంశాలు, చేయాల్సిన ఏర్పాట్లపై ఓ నివేదిక రూపొందించింది.. ఇక, ఇప్పుడు అయోధ్య వెళ్లి.. ఆలయ ట్రస్ట్ కి ఆ నివేదికకు సమర్పించనుంది టీటీడీ ఈవో ధర్మారెడ్డి కమిటీ.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Exit mobile version