Site icon NTV Telugu

వైఎస్‌ షర్మిల ను కలిసిన టీటీడీ చైర్మన్‌

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా మరియు రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు వైఎస్‌ షర్మిల. అయితే.. వైఎస్‌ షర్మిల చేస్తున్న ఈ పాదయాత్ర నేటికి ఐదోవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర లో ఓ బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. టీటీడీ పాలక మండలి చైర్మన్‌, వైసీపీ సీనియర్‌ నేత వైపీ సుబ్బారెడ్డి.. వైఎస్‌ షర్మిలను పాదాయాత్రలో కలిశారు. ఈ సందర్భంగా కాసేపు షర్మిలతో ముచ్చటించారు వైవీ. సుబ్బారెడ్డి. అయితే.. వైఎస్‌ షర్మిలను వైవీ సుబ్బారెడ్డి కలవడంపై తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఇవాళ వైఎస్‌ షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.

Exit mobile version