Site icon NTV Telugu

TS TRT : తెలంగాణ టీఆర్టీ పరీక్షలపై ఎన్నికల ప్రభావం..ఆందోళనలో అభ్యర్థులు..

Whatsapp Image 2023 10 10 At 11.23.05 Am

Whatsapp Image 2023 10 10 At 11.23.05 Am

తెలంగాణ రాష్ట్రం లో ఎప్పటి నుంచో ఖాళీ గా టీచర్ల పోస్టుల భర్తీ కి ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని 33 జిల్లాల్లో 5,089 టీచర్‌ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీకి విద్యా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.డీఎస్సీ ద్వారా పరీక్షలను నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానం లో జరపనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అక్టోబర్ 21 వ తేదీ నాటికీ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియనుంది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది…నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ అంటూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 20 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించాల్సిన టీ ఆర్టీ పరీక్షలు వాయిదా పడే అవకాశముందనే వాదన లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది..అయితే రీసెంట్ గా విద్యా శాఖ తెలంగాణ రాష్ట్రం లో టెట్ పరీక్ష ను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది.టెట్‌ లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే విద్యా శాఖ ఈ సారి టీఆర్టీ సిలబస్ లో కూడా స్వల్ప మార్పులు చేసింది. దీనితో అభ్యర్థులు ఎంత కష్టమైన కూడా పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు. కానీ సడన్ గా ఎన్నికల నోటిఫికేషన్ రావడం తో పరీక్షలు జరుగుతాయా లేదా అని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version