Site icon NTV Telugu

TS TET : సెప్టెంబర్ 27 న రానున్న ఫలితాలు.. త్వరలోనే ఆన్సర్ కీ విడుదల…

Whatsapp Image 2023 09 16 At 12.42.31 Pm

Whatsapp Image 2023 09 16 At 12.42.31 Pm

తెలంగాణ రాష్ట్రం లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15 న సజావుగా జరిగింది.. రాష్ట్రవ్యాప్తం గా నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్ష కు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.గతం లో కఠినం గా వచ్చిన పేపర్-1 ప్రశ్నపత్రం ఈసారి సులభం గా రావడం జరిగింది.. పేపర్-2 ప్రశ్న పత్రం మాత్రం కాస్త కఠినంగా ఇవ్వడం జరిగింది.. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినం గా ఉన్నాయి. అయితే టెట్ పేపర్-1 పరీక్ష కు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు.

టెట్ ప్రాథమిక కీ ని మరో మూడు, నాలుగు రోజుల్లో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటు లో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాత నే కీ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. తాత్కాలిక కీ విడుదల అయిన తరువాత అభ్యంతరాల ను స్వీకరించి ఆ తరువాత ఫైనల్ కీ విడుదల చేస్తారు.. అయితే ఈ పరీక్ష లో అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీ  లో తప్పిదాలు జరిగాయని సమాచారం..కొన్నిచోట్ల ఒక పేపర్ కు బదులు మరో పేపర్.. ఒక అభ్యర్థి ఓఎంఆర్ బదులు మరో అభ్యర్థి ఓఎంఆర్ ను పంపిణీ చేయడం జరిగింది. ఆ తరువాత ఓఎంఆర్ లో జరిగిన తప్పులను వైట్నర్ తో సరి చేసారు.. వైట్నర్ వాడిన ఓఎంఆర్ షీట్లు కూడా చెల్లుబాటు అవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.అయితే ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27 న విడుదల కానున్నట్లు అధికారులు తెలియజేసారు..

Exit mobile version