Site icon NTV Telugu

Donald Trump: నేడే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు దక్కేనా..?

Trump

Trump

Donald Trump: నేడు ట్రంప్‌కు గుడ్ ఫ్రైడే అవుతుందా? బ్యాడ్ ఫ్రైడే అవుంతుందా? అని చర్చ జోరందుకొంది. నేడు నోబెల్ బహుమతి ప్రకటించనున్నారు. ది పీస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ వరిస్తుందా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శాంతి అధ్యక్షుడు అని తనకు తాను బిరుదు ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తింపు కోసం ఒత్తిడి తెస్తుండటంతో 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తీవ్ర ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. గాజా, ఇజ్రాయెల్, హమాస్‌లలో ట్రంప్ శాంతి ప్రయత్నాల అనంతరం.. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన శాంతి పురస్కారం వరిస్తుందా..? నార్వే పార్లమెంటు కమిటీ నియమించిన ఐదుగురు సభ్యుల నోబెల్‌ కమిటీ రహస్య సమావేశాల్లో ట్రంప్‌ పేరు చర్చకు వస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ట్రంప్‌ను తిరస్కరిస్తే నార్వే దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ట్రంప్‌కు నోబెల్ రాకపోతే.. బదులుగా సడాన్ సంస్థకు లేదా బెలూచిస్థాన్ కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం ఉంది..

READ MORE: IND vs WI Test: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ సెకండ్ టెస్ట్.. టీమిండియాలో భారీ మార్పులు?

ట్రంప్ పరిపాలన ప్రపంచ దౌత్యంలో ఆయన సాధించిన విజయాలను పదే పదే నొక్కి చెబుతోంది. గాజాలో ఇటీవల జరిగిన కాల్పుల విరమణ చర్చలను హైలైట్ చేసింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ ట్రంప్‌ను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. “నేను ఏడు యుద్ధాలను ఆపేశాను.. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్‌, రష్యా) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాం” అని ట్రంప్ చాలా సార్లు చెప్పారు. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటాం.. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలను ఆపలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించి, ట్రంప్‌ను విజేతగా ప్రకటించేందుకు పరోక్షంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారని పరోక్షంగా చెప్పేందుకు శ్వేత సౌధం ప్రయత్నిస్తోంది.

Exit mobile version