Site icon NTV Telugu

Train Accident: దరిద్రం నెత్తిన కూర్చుంటే ఇలానే ఉంటుంది.. ప్లాట్ ఫాంపై నిలబడ్డా రైలు గుద్దేసింది

Train Accident

Train Accident

Train Accident: రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని చాలాసార్లు చూసి ఉంటారు. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో బుద్ధి రావడంలేదు. రైల్వే స్టేషన్లో రైలు దూరంగా నిలబడి ఉండాలని అధికారులు మొత్తుకున్నా వింటారా.. అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోలో ఏముందో తెలుసుకుందాం?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రయాణికులు రైలు కోసం ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్నట్లు చూడవచ్చు. ఇంతలో ఒక యువకుడు ట్రాక్ పక్కన నిలబడి, అతని పక్కనే మరొక వ్యక్తి వస్తున్నాడు. ఇందులో ఒక వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకుని తన చేతులను స్వయంగా కడుక్కోవడం మొదలుపెడతాడు. ఇంతలో రైలు అతి వేగంతో వచ్చింది. ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన యువకుడిని బలంగా ఢీకొట్టింది. అలాంటి పరిస్థితిలో యువకులిద్దరూ చాలా దూరం వెళ్లి లేవలేక పడిపోతున్నారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనితో పాటు ఈ వీడియో ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్ కు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ వీడియో @MuragundlaVenky అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.

Exit mobile version