బీటెక్ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం ఆదోని పట్టణంలో వెలుగు చూసింది. రైల్వే పోలీసులు, విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు, నలినీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు సలేంద్ర ఈశ్వర్ (20) సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో ఈశ్వర్ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఈశ్వర్ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. తెల్లవారు జామున ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలోని నగరూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి వెళ్లి చూశామన్నారు. మరికొన్ని వివరాల కోసం వీడియో చుడండి..
Kurnool: బీటెక్ విద్యార్థి బలవన్మరణం..(వీడియో)
- రైలు కింద పడిన బీటెక్ విద్యార్థిలో ఆత్మహత్య