రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. రేపు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్ఆర్ స్కూల్ రోడ్డులో భారీ వాహనాలకు ట్రక్కులు కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించబడవు అని తెలిపారు. కాబట్టి హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం నుంచి వచ్చే భారీ వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర గల ఓఆర్ఆర్ మీదుగా, ఎనుమాముల మార్కెట్, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు మీదుగా ఖమ్మంకు వెళ్ళ వలసి ఉంటుంది అని పోలీసులు వెల్లడించారు.
Read Also: Kangana Ranaut: మహిళలలో ఆ భాగాలే కాదు ఇతర భాగాలు కూడా ఉన్నాయి.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్
అదే విధంగా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ల వలసిన భారీ వాహనాలు నాయుడు పంపు నుంచి పోర్టు రోడ్డు, తెలంగాణ జంక్షన్, ఎనుమాముల మార్కెట్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా హైదరాబాద్ కు వెళ్ళ వలసి ఉంటుంది అని వరంగల్ పోలీసులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ మీటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు గానూ.. ట్రై సీటి పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా తేదీ: 27-10-2023 మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 06.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కోనసాగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.