విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాన్ని గుర్తించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్స్‌లో మహా దారుణాన్ని చూశారు. ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో అనేక అంశాలను గుర్తించారు. మూడు నుంచి ఐదు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అన్నీ నిల్వ ఉంచినవేనని గుర్తించారు.. 42 నమూనాలు సేకరించారు.. పలు హోటల్స్ రెస్టారెంట్స్ దాబాలు లో సుమారు 150 కేజీల కుళ్ళిన చికెన్ గుర్తించారు.
READ MORE: HIV Vaccine: HIV వ్యాక్సిన్ మొదటి ట్రయల్ విజయవంతం..!
ప్రముఖ హోటల్స్ హైజెనిక్ ఫుడ్ పేరుతో విషపూరిత ఆహారం అందిస్తున్నాయి. వంటల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్టులు, గ్రేవీలు, కర్రీలు కలుషితంగా ఉన్నాయి. హానికారక రంగులు వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమడుతున్నారు.. 20 బృందాలతో 40 చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు వీటిని గుర్తించారు. 24 కేసులు నమోదు చేశారు. నేడు బేకరీ స్వీట్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు… నిల్వ ఉంచిన బ్రెడ్లు కాలం చెల్లిన బన్స్, పిల్లలు తినే ఆహార పదార్థాలలో కాలం చెల్లిన రంగులు వినియోగాన్ని గుర్తించారు. ఐస్ క్రీమ్ లలో స్లో పాయిజన్ ఎక్కించే రసాయనాలు కలుపుతున్నట్లు తేల్చారు.. ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో రెండు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి..
