Site icon NTV Telugu

Nagpuri Ramesh : ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై సస్పెన్షన్ వేటు

Ramesh

Ramesh

ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నాగపురి రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. డోప్ టెస్ట్ కు సాంపిల్స్ ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. ఈ అంశంలో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. కాగా.. నాగపురి రమేష్ గతంలో ద్రోణాచారి అవార్డు పొందారు.

READ MORE: OnePlus 13: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రూ. 9 వేల డిస్కౌంట్.. కళ్లు చెదిరే ఫీచర్లు

అంతర్జాతీయ ప్లేయర్స్ దుతి చంద్, పారా ఒలంపియాన్ జీవంజి దీప్తి, నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దారు. నాగపురితో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశంపై తాజాగా రమేష్ స్పందించారు. “నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు. చేసిన వారిని ప్రోత్సహించలేదు. ⁠తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభా వంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే నా జీవితాన్ని దారపోశా. ⁠ఈ విషయంలో ఎలాంటి విచారణకైన సిద్ధం.” అని స్పష్టం చేశారు.

READ MORE: Malavika Mohanan : ట్రైన్ లో ముద్దిస్తావా అన్నాడు.. మాళవిక షాకింగ్ కామెంట్స్

Exit mobile version